: మంత్రి నారాయణ అక్రమాలను నిరూపిస్తాం: నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్
ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ అక్రమాలన్నింటినీ నిరూపిస్తామని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు నగర అభివృద్ధికి ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించిన తమపై నారాయణ ఆరోపణలకు దిగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేటి ఉదయం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా అనిల్ కుమార్, మంత్రి నారాయణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అడగడమే తమ తప్పన్నట్లు మంత్రి వ్యవహరిస్తున్నారన్నారు. తమపై అకారణంగా ఆరోపణలు చేయడమే కాక, విశాఖలో తన పనితీరు చూడమని నారాయణ చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.