: హైదరాబాదు ఫెడరల్ బ్యాంకులో భారీ చోరీ
హైదరాబాదు మల్కాజిగిరిలోని ఫెడరల్ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. ఈ బ్యాంకులో చోరీ జరగడం ఇది రెండోసారి. ఈ తెల్లవారుజామున దుండగులు బ్యాంకు షట్టర్లు తొలగించి చోరీకి పాల్పడ్డారు. దాదాపు రూ.కోటి విలువైన బంగారం, కొంత నగదు కూడా దోచుకెళ్లినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బ్యాంకులో క్లూస్ టీంతో ఆధారాలు సేకరిస్తున్నారు.