: భార్యకు గిఫ్టు సెలెక్ట్ చేయడం చాలా కష్టం అంటున్న ఒబామా


అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడే అయినా, ఆయనా ఓ మహిళకు భర్తే. రానున్న క్రిస్మస్ ను తలచుకుని బరాక్ ఒబామా ఇప్పుడు తలపట్టుకుంటున్నారు. ఎందుకంటే, ప్రతి క్రిస్మస్ కు కుటుంబానికి కానుకలు అందించడం ఒబామాకు ఎంతో ఇష్టం. పెద్ద కుమార్తె మలియా (16) ఏం తీసుకువచ్చినా సంతోషిస్తుందని, భార్య మిచెల్లీ మాత్రం ఓ పట్టాన ఇష్టపడదని తన ఆందోళనకు కారణం తెలిపారు. "ఆమె చాలా ఫ్యాషనబుల్, చూడ్డానికి బాగుంటుంది. ఇప్పుడామెకు ఎలాంటి దుస్తులు కొనాలన్నదే సమస్యగా మారింది. సినిమాలు ఎక్కువగా చూసే మలియాకు ఓసారి 100 గ్రేటెస్ట్ సినిమాలను బహుకరించాను, ఆమె ఆ కానుకను ఎంతో ఇష్టపడింది. కానీ, మిచెల్లీ కోసం షాపింగ్ చేయడం చాలా కష్టం" అని ఒబామా వివరించారు. కాగా, శుక్రవారం ఒబామా తన కుటుంబంతో హవాయి వెళతారు. ప్రతి ఏడాది ఆయన అక్కడే క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు.

  • Loading...

More Telugu News