: విజయవాడలో కొనసాగుతున్న కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల సమ్మె
గత అర్ధరాత్రి నుంచి ఏపీ కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్ లో ఉద్యోగులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను శాఖ ఉద్యోగులుగా గుర్తించాలని, సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఉద్యోగులు సమ్మె విరమించాలని ఏపీ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్ జైన్ కోరారు. ఈనెల 23న జేఏసీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించి డిమాండ్లపై చర్చిస్తామని తెలిపారు.