: గోదావరిఖనిలో విద్యార్థినిపై ప్రేమోన్మాది దాడి


తనను ప్రేమించని కారణంగా ఓ దుర్మార్గ ప్రేమోన్మాది డిగ్రీ చదువుతున్న విద్యార్థినిపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని గాంధీ డిగ్రీ కళాశాలలో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై అదే కళాశాలలో సెకండ్ ఇయర్ విద్యార్థి శ్రీకాంత్ బ్లేడుతో దాడి చేశాడు. మధ్యాహ్నం భోజన సమయంలో ఈ దారుణం జరిగింది. గాయపడిన శిరీషను తోటి విద్యార్థినులు గమనించి కళాశాల యాజమాన్యానికి సమాచారం అందించారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. శ్రీకాంత్ గత కొద్ది రోజులుగా తనను ప్రేమించాలని శిరీష వెంట పడుతున్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు వివరించారు.

  • Loading...

More Telugu News