: 'బిగ్ సినిమాస్'ను వదిలించుకున్న అనిల్ అంబానీ


'అడాగ్' కంపెనీల అధినేత అనిల్ అంబానీ తన గ్రూపులోని 'బిగ్ సినిమాస్'ను వదిలించుకున్నారు. రిలయన్స్ కేపిటల్ రుణభారాన్ని తగ్గించుకునే క్రమంలో తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అనిల్ అంబానీకి రూ.700 కోట్ల మేర భారం తప్పనుంది. బిగ్ సినిమాస్ పేరిట మల్టీ ప్లేక్స్ (ధియేటర్ల సముదాయం) నిర్మాణ రంగంలోకి దిగిన అనిల్ అంబానీ అందులో ఆశించినంతగా ఫలితాలు రాబట్టలేకపోయారు. ఈ క్రమంలో బిగ్ సినిమాస్ ను దక్షిణ భారతానికి చెందిన 'కార్నివాల్' కు ఆయన విక్రయించారు. ఈ మేరకు రిలయన్స్ కేపిటల్, కార్నివాల్ ల మధ్య కుదిరిన ఒప్పందానికి నియంత్రణ సంస్థల అనుమతి లభించాల్సి ఉంది. అన్ని అనుమతులను త్వరితగతిన పొంది, ఈ ఏడాది ముగిసేలోగానే ఈ డీల్ ను పూర్తి చేయాలని ఇరు సంస్థలు భావిస్తున్నాయి. ఈ రంగంలో ఇప్పటిదాకా జరిగిన ఖరీదైన ఒప్పందాల్లో ఇదే పెద్దది.

  • Loading...

More Telugu News