: బ్లాక్ మనీలో టాప్-3 ఇండియానే... పదేళ్లలో తరలిన మొత్తం రూ.28 లక్షల కోట్లు
ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా, లెక్కల్లో చూపకుండా, అత్యధిక ధనాన్ని విదేశాలకు తరలిస్తున్న దేశాల జాబితాలో ఇండియా మూడవ స్థానంలో నిలిచింది. 2003 నుంచి 2012 వరకు మొత్తం 439.59 బిలియన్ డాలర్లు (సుమారు రూ.28 లక్షల కోట్లు) ఇండియా నుంచి విదేశాలకు తరలివెళ్లినట్టు జీఎఫ్ఐ (గ్లోబల్ ఫైనాన్సియల్ ఇంటెగ్రిటీ) నివేదిక వెల్లడించింది. ఒక్క 2012లోనే రూ.6 లక్షల కోట్ల నల్లధనం విదేశీ బ్యాంకుల్లో చేరిందని పేర్కొంది. కాగా, బ్లాక్ మనీ జాబితాలో రష్యా మొదటి స్థానంలో ఉండగా, చైనా రెండవ స్థానంలో నిలిచింది.