: సిరియాలో ఆర్మీ స్థావరాన్ని స్వాధీనం చేసుకున్న ఉగ్రవాదులు
అల్ ఖైదా అనుబంధ ఉగ్ర సంస్థ అల్ నుస్రా ఫ్రంట్ సిరియాలోని ఓ కీలకమైన ఆర్మీ స్థావరాన్ని స్వాధీనం చేసుకుంది. దీంతో, టర్కీ సరిహద్దు సమీపంలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ మొత్తం అల్ నుస్రా అధీనంలోకి వెళ్లిపోయింది. యుద్ధ ట్యాంకులు, భారీ ఎత్తున ఆయుధాలతో ఉగ్రవాదులు దాడిచేసి ఆర్మీ స్థావరాన్ని ఆక్రమించారని సిరియా మానవహక్కుల అబ్జర్వేటరీ డైరెక్టర్ రమి అబ్దుల్ రెహమాన్ వెల్లడించారు. ఇడ్లిబ్ నుంచి అధ్యక్షుడు బషర్ అసద్ వెళ్లిపోవాలంటూ రెబల్స్ చేపట్టిన ఆందోళనను వెనకుండి నడిపించింది అల్ నుస్రానే కావడం గమనార్హం.