: కాంట్రాక్టు కార్మికుల సమ్మెతో ఏపీలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు


ఏళ్లుగా పనిచేస్తున్న తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మెతో ఏపీలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది. ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలమైన నేపథ్యంలో, గత అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలోని మొత్తం 15 వేల మంది కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెకు దిగారు. దీంతో, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. కార్మికులతో చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని, కార్మికులు తక్షణమే సమ్మెను విరమించాలని రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ కోరారు. అయితే, ఆయన విజ్ఞప్తిని ఉద్యోగులు పట్టించుకోలేదు. ఈ నెల 23న ప్రభుత్వంతో చర్చించి, సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామన్న ఆయన వినతిని కార్మికులు తోసిపుచ్చారు. సమ్మె నేపథ్యంలో నేడు విద్యుత్ సరఫరాలో మరిన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

  • Loading...

More Telugu News