: మెజారిటీ ఉందిగా...రామమందిరం కట్టేద్దాం: లోక్ సభలో శివసేన ఎంపీ వ్యాఖ్య


అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై సోమవారం లోక్ సభలో అలజడి రేగింది. శివసేన ఎంపీ చంద్రకాంత్ ఖైరే చేసిన వ్యాఖ్యలతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. లోక్ సభలో పూర్తి స్థాయి మెజారిటీ ఉంటే, అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తామని గతంలో ప్రధాని హోదాలో అటల్ బిహారీ వాజ్ పేయి చేసిన ప్రకటనను ఊటంకించిన ఖైరే, ప్రస్తుతం సభలో బీజేపీకి పూర్తి స్థాయి మద్దతు ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. స్పష్టమైన మెజారిటీ ఉన్న నేపథ్యంలో అయోధ్యలో రామమందిరం నిర్మాణాన్ని తక్షణమే మొదలుపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల ప్రధానిని కలిసిన కొందరు ముస్లిం మహిళలు కూడా అయోధ్యలో రామమందిరం ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేసిన విషయాన్ని ఖైరే సభ దృష్టికి తీసుకొచ్చారు. ఖైరే వ్యాఖ్యలను బీజేపీ సభ్యులు సమర్ధించగా, విపక్షాలు మాత్రం నిరసన వ్యక్తం చేశాయి. దీంతో సభలో అలజడి రేగింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోర్టు పరిధిలో ఉన్న విషయని స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ్యులకు సూచించారు.

  • Loading...

More Telugu News