: మంత్రివర్గ విస్తరణ..కేబినెట్ భేటీ...అఖిలపక్ష సమావేశం: నేడు బిజీబిజీగా కేసీఆర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు అత్యంత బిజీగా గడపనున్నారు. తొలిసారి మంత్రివర్గ విస్తరణను చేేపడుతున్న ఆయన నేటి ఉదయం నుంచి సాయంత్రం దాకా తీరికలేకుండా సమావేశాల్లో మునిగిపోనున్నారు. నేటి ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో జరిగే మంత్రివర్గ విస్తరణకు హాజరయ్యే కేసీఆర్ 12 గంటలకు సెక్రటేరియట్ లో కేబినెట్ భేటీని నిర్వహించనున్నారు. ఈ భేటీలో పాత మంత్రులతో పాటు కొత్త మంత్రులు కూడా పాల్గొంటారు. భేటీలో భాగంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి కేసీఆర్ శాఖలను కేటాయించనున్నారు. దీంతో ప్రమాణ స్వీకారం చేసిన గంటలోగానే కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తి కానుంది. కేబినెట్ భేటీ అనంతరం కేసీఆర్ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అన్యాక్రాంతమైన భూముల విషయంపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అన్ని రాజకీయ పార్టీలు హాజరుకానున్న ఈ భేటీ సుదీర్ఘంగా జరగనుంది.

  • Loading...

More Telugu News