: విజయనగరం పీఏసీఎస్ లో రూ.17 కోట్ల దుర్వినియోగం...విచారణకు రంగం సిద్ధం
విజయనగరం జిల్లా పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పీఏసీఎస్)లో భారీ అవినీతి వెలుగు చూసింది. గరుగుబిల్లి మండలం రావివలస పీఏసీఎస్ లో రూ.17 కోట్ల మేర నిధులను కొందరు వ్యక్తులు బినామీ పేర్లతో జేబుల్లో వేసుకున్నారు. ఈ ఉదంతంపై మీడియాలో పలు కథనాలు రావడంతో అప్రమత్తమైన ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఉపక్రమిస్తున్నారు. తొలి విడతలో భాగంగా 250 మందిని విచారించేందుకు నోటీసులు జారీ చేస్తున్నారు. రైతుల పేరిట బొక్కిన నిధులను అక్రమార్కుల నుంచి కక్కించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.