: పశ్చిమ గోదావరి జిల్లాలో నిషేధిత సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ సభ్యుల అరెస్ట్
నిషేధిత సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీకి చెందిన సభ్యులను పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలోని బుట్టాయగూడెం మండలం రేగులగుంట సమీపంలోని జల్లేరువాగు వద్ద న్యూడెమోక్రసీ సభ్యులు సమావేశమయ్యారన్న విశ్వసనీయ సమాచారంతో దాడులు చేసిన పోలీసులు 11 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిషేధిత సంస్థ సభ్యులతో పాటు వారి వద్ద నుంచి 8 తుపాకులు, మందుగుండు సామగ్రి, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారంతా చంద్రన్న, అశోక్ వర్గాలకు చెందిన వారుగా భావిస్తున్నారు.