: ‘కేఫ్’ ఆపరేషన్ ముగిసింది... ఉగ్రవాది హతం, మరో ఇద్దరు బందీలు మృతి
ఆస్ట్రేలియా నగరం సిడ్నీలో ఉగ్రవాదిని ఎట్టకేలకు పోలీసులు అంతమొందించారు. అతడి బందీఖానాలోని 30 మందిని పోలీసులు విడిపించారు. నేటి ఉదయం నుంచి కొనసాగుతున్న ఉద్రిక్తత దాదాపు 17 గంటల తర్వాత కాని చల్లబడలేదు. తొలుత ఉగ్రవాదితో చర్చలు జరిపి సామరస్యంగా బందీలను విడిపించాలని పోలీసులు చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో కొద్దిసేపటి క్రితం మార్టిన్ కేఫ్ లోకి చొచ్చుకుని వెళ్లిన పోలీసులు ఉగ్రవాదిపై కాల్పులు దిగారు. పోలీసుల కాల్పులతో ఉగ్రవాది కూడా కాల్పులు ప్రారంభించాడు.పోలీసుల కాల్పుల్లో ఉగ్రవాది మరణించాడు. ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించగా, ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే బందీల్లోని గుంటూరు జిల్లా వాసి విశ్వకాంత్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. కాల్పుల్లో చనిపోయిన వారు ఎవరన్న విషయం తేలాల్సి ఉంది. తాము చేపట్టిన ఆపరేషన్ దిగ్విజయంగా ముగిసిందని కొద్ది నిమిషాల క్రితం పోలీసులు ప్రకటించారు.