: వైకాపాకు జనక్ ప్రసాద్ గుడ్ బై!


వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ అధికార ప్రతినిధి జనక్ ప్రసాద్ ఝలకిచ్చారు. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన జనక్ ప్రసాద్ కాంగ్రెస్ పార్టీలో ఉండగా యువజన కాంగ్రెస్ నేతగా సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. అంతేకాక కార్మిక నేతగా ఆయన చిరపరిచితులు. సింగరేణి కాలరీస్ కార్మిక సంఘానికి ఆయన ఏకంగా 18 సార్లు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై రికార్డు నెలకొల్పారు. వైకాపాలో పార్టీ ఆవిర్భావం నుంచే కొనసాగుతున్న జనక్ ప్రసాద్, పార్టీలో కీలక నేతగానూ ఎదిగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు వ్యతిరేకంగా పార్టీ యూటర్న్ తీసుకుంది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. అయితే ఎంతమంది నేతలు వెళ్లినా, పార్టీని అంటిపెట్టుకుని ఉన్న జనక్ ప్రసాద్ తాజాగా నేడు పార్టీకి రాజీనామా చేశారు.

  • Loading...

More Telugu News