: రేపటి ఏపీ కేబినెట్ భేటీ బుధవారానికి వాయిదా
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం బుధవారానికి వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం కేబినెట్ భేటీ మంగళవారం జరగాల్సి ఉంది. మంగళవారం నాటి కేబినెట్ భేటీని బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం అందుకు గల కారణాలను వెల్లడి చేయలేదు. అయితే తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మరణం, రాజధాని నిర్మాణానికి సంబంధించి సీఆర్డీఏ బిల్లు ఓ కొలిక్కి రాకపోవడం తదితర కారణాల వల్ల కేబినెట్ భేటీని బుధవారానికి వాయిదా వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.