: ముగిసిన చక్రి అంత్యక్రియలు


ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి పార్థివ దేహానికి కొద్దిసేపటి క్రితం అంత్యక్రియలు పూర్తయ్యాయి. భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు, సంగీత ప్రియులు చక్రికి కన్నీటి వీడ్కోలు పలికారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో కొద్దిసేపటి క్రితం చితికి నిప్పంటించారు. గుండెపోటు కారణంగా చక్రి నేటి ఉదయం మృత్యువాతపడ్డ సంగతి తెలిసిందే. చక్రి అకాల మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఏపీ, తెలంగాణ సీఎంలు చక్రి మరణం పట్ల సంతాపం ప్రకటించగా, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు

  • Loading...

More Telugu News