: దర్శకుడు బాలచందర్ ఆరోగ్యం నిలకడగా ఉంది: కావేరి ఆసుపత్రి వైద్యులు
ప్రముఖ సినీ దర్శకుడు బాలచందర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెన్నై కావేరీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మరోవైపు బాలచందర్ ను నటులు రజనీకాంత్, కుష్బూ పరామర్శించారు. ఈ మధ్యాహ్నం అస్వస్థతకు గురయిన ఆయన్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్చారు.