: ఏసీబీ వలకు చిక్కిన జీవీఎంసీ ఓఎస్డీ!
గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పోరేషన్ (జీవీఎంసీ) లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ)గా విధులు నిర్వహిస్తున్న గోవిందరావు అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కారు. ఓ కాంట్రాక్టరు నుంచి రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గోవిందరావు లంచగొండితనంతో విసిగిపోయిన కాంట్రాక్టర్ నుంచి ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు పక్కాగా ప్రణాళిక రచించి ఆయనను పట్టుకున్నారు. ముందస్తు పథకం ప్రకారం కొద్దిసేపటి క్రితం జీవీఎంసీలో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు గోవిందరావును అదుపులోకి తీసుకున్నారు.