: రూ.1 లక్ష దోచిన మహిళ...సీసీ కెమెరాకు చిక్కింది!


బ్యాంకులో చేతివాటం ప్రదర్శించిన ఆ మహిళ క్షణాల్లోనే దొరికిపోయింది. పరాయి వ్యక్తుల నుంచి సొమ్ము కాజేయడంలో ఆరితేరిన ఆ మహిళ, సీసీ కెమెరాల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది. బ్యాంకులో నగదు డ్రా చేసుకున్న ఓ వ్యక్తి నుంచి రూ.1 లక్షను కాజేసిన మహిళను బ్యాంకు అధికారులు సీసీ కెమెరా ఫుటేజీల సహాయంతో క్షణాల్లో గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పులిదిండిలోని ఆంధ్రాబ్యాంకు శాఖలో ఈ ఘటన నేటి మధ్యాహ్నం చోటుచేసుకుంది. గుట్టుచప్పుడు కాకుండా డబ్బు కొట్టేసుకుని వెళ్లిన మహిళను సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా గుర్తించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారుల పక్కా సమాచారంతో మహిళా చోర శిఖామణిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు బయలుదేరారు.

  • Loading...

More Telugu News