: విశ్వకాంత్ బందీఖానాపై చంద్రబాబు ఆరా


ఆస్ట్రేలియాలో దుండగుడి బందీఖానాలో చిక్కుకున్న గుంటూరు జిల్లా వాసి, ఇన్ఫోసిస్ ఉద్యోగి విశ్వకాంత్ అంకిరెడ్డి విషయంపై ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఆరా తీశారు. ఆస్ట్రేలియాలో దుండగుడు బందీలుగా పట్టుకున్న వారిలో విశ్వకాంత్ ఉన్న విషయాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ధ్రువీకరించిన నేపథ్యంలో చంద్రబాబు స్పందించారు. విశ్వకాంత్ తాజా పరిస్థితిపై అధికారులతో ఆరా తీసిన చంద్రబాబు, అతనిని విడిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే విదేశాంగ శాఖతో మాట్లాడాలని ఆయన అధికారులకు సూచించారు. విశ్వకాంత్ కు ఎలాంటి ముప్పు కలుగకుండా విడిపించేందుకు అందుబాటులోని ఏ ఒక్క అవకాశాన్నీ వదలరాదని ఆయన ఆదేశించారు.

  • Loading...

More Telugu News