: 18న అసెంబ్లీ ముందుకు ఏపీ సీఆర్డీఏ బిల్లు


నవ్యాంధ్ర నూతన రాజధానికి సంబంధించిన ఏపీ కేపిటల్ రీజనల్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీఏ) బిల్లు ఈ నెల 18న అసెంబ్లీ ముందుకు రానుంది. అసెంబ్లీ తొలి రోజు సమావేశాల్లో భాగంగా నేడు మరణించిన తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణకు సభ నివాళులర్పించనుంది. అనంతరం సీఆర్డీఏ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 18న సమావేశాలు ప్రారంభమయ్యే రోజున బిజినెస్ అడ్వైజరీ మీటింగ్ జరుగుతుంది. ఈ భేటీలో సీఆర్డీఏ బిల్లును ప్రవేశపెట్టే విషయంపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. ఈసారి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. ఈ సమావేశాలను గుంటూరులో నిర్వహించాలని తొలుత భావించినా, సౌకర్యాల కొరత నేపథ్యంలో హైదరాబాదులోనే జరపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News