: తానా ఆధ్వర్యంలో దర్శకుడు బాపు విగ్రహావిష్కరణ


ప్రముఖ దర్శకుడు బాపు జయంతి సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో ఆయన విగ్రహాన్ని ఏపీ సాంస్కృతిక శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నర్సాపురంలో 2కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పీతల సుజాత, పి.మాణిక్యాలరావు, ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని తదితరులు పాల్గొన్నారు. తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సమకూర్చిన నిధులతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News