: కొత్త సీబీఐ డైరెక్టర్ కు 2జీ కేసు దర్యాప్తు బాధ్యతలు


సీబీఐ డైరెక్టర్ అనిల్ కుమార్ సిన్హాకు 2జీ కేసు దర్యాప్తు బాధ్యతలను అప్పగించేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి దర్యాప్తు బాధ్యతలను ఆయన తీసుకోనున్నారు. ఈ కేసులో తీవ్ర ప్రభావం చూపేందుకు ప్రయత్నించారంటూ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హాపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దాంతో, 2జీ కేసు దర్యాప్తుకు దూరంగా ఉండాలని ఆయనను సుప్రీం ఆదేశించింది. ఇటీవల రంజిత్ సిన్హా పదవీకాలం ముగియడంతో కొత్త డైరెక్టర్ గా అనిల్ కుమార్ నియమితులయ్యారు.

  • Loading...

More Telugu News