: 'ఫాస్ట్' పథకం వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేలా ఉంది: టీఎస్ ప్రభుత్వంపై హైకోర్టు ఫైర్


ఫీజు రీయింబర్స్ మెంటుకు సంబంధించి టీఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 'ఫాస్ట్' పథకంపై హైకోర్టు సీరియస్ అయింది. ఫాస్ట్ పథకం వేర్పాటువాదాన్ని ప్రోత్సహించేలా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విధానం వల్ల ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడకు రారని... ఒడిశాలాంటి పేద రాష్ట్రాల విద్యార్థులకు ఈ విధానంతో తీరని అన్యాయం జరుగుతుందని తెలిపింది. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సంక్రాంతి సెలవుల తర్వాత తదుపరి విచారణను చేపడతామని తెలిపింది.

  • Loading...

More Telugu News