: చక్రి నా తమ్ముడిలాంటి వాడు: బాలకృష్ణ


చక్రి హఠాన్మరణాన్ని నమ్మలేకపోతున్నానని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. చక్రికి నివాళి అర్పించిన అనంతరం మాట్లాడుతూ, చక్రి తన తమ్ముడిలాంటి వాడని తెలిపారు. ఇటీవల జరిగిన 'మేము సైతం' కార్యక్రమంలో తామిద్దరం కలుసుకున్నామని... తన సినిమాకు మరోసారి సంగీతం అందించాలని అడిగానని, ఇంతలోనే ఇలా జరిగిందని చెప్పారు. ఎప్పుడు ఏం జరుగుతుందో? అని ఆయన వేదాంత ధోరణిలో వ్యాఖ్యానించారు. బాలయ్య సినిమా 'సింహ'కు చక్రినే సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకు చక్రికి నంది అవార్డు వచ్చింది.

  • Loading...

More Telugu News