: సోనియా గాంధీ, రాహుల్ లకు సమన్లపై స్టే పొడిగింపు
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, మరో ముగ్గురికి ఇచ్చిన సమన్లపై స్టేను ఢిల్లీ హైకోర్టు పొడిగించింది. ఈ మేరకు జస్టిస్ వీపీ వైశ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో తమ వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని అంతకుముందు సోనియా, రాహుల్ ల తరపున న్యాయవాదులు కోరారు. గతంలో ఈ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన సమన్లపై ఇప్పటికే పలుమార్లు న్యాయస్థానం స్టే ఇచ్చింది.