: కెప్టెన్సీ దక్కడంతో మురిసిపోతున్న స్మిత్


ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ గా ఎంపికైన యువ ఆల్ రౌండర్ స్టీవెన్ స్మిత్ మురిసిపోతున్నాడు. క్లార్క్ స్థానంలో భారత్ తో మిగిలిన టెస్టులకు సారథ్య బాధ్యతలు అప్పగించడం "ఓ అద్భుతమైన థ్రిల్' కలిగిస్తోందని పేర్కొన్నాడు. టెస్టు జట్టుకు కెప్టెన్సీ వహించడం తన స్వప్నమని అన్నాడు. ఇప్పుడా అవకాశం వచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు. తనకు దేశవాళీల్లో న్యూ సౌత్ వేల్స్ జట్టుకు, బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ సిక్సర్స్ జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం ఉందన్నాడు. భారత్ తో సిరీస్ లో సీనియర్లు 100 శాతం సహకరిస్తారన్న నమ్మకం ఉందని తెలిపాడు.

  • Loading...

More Telugu News