: సచిన్ కు మరో అపురూప గౌరవం


భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మరో అపురూపమైన గౌరవాన్ని సొంతం చేసుకోనున్నాడు. గిన్నిస్ బుక్ తన 60వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 60 మంది విఖ్యాత అథ్లెట్లను గౌరవించాలని నిర్ణయించింది. వారికి ఓ సర్టిఫికెట్, ఓ మెడల్ ను ప్రదానం చేస్తారు. ఈ జాబితాలో సచిన్ కూడా ఉన్నాడు. దీనిపై సచిన్ మాట్లాడుతూ, గిన్నిస్ బుక్ వార్షికోత్సవ వేడుకల్లో తనకూ చోటు కల్పించడం సంతోషదాయకమన్నాడు. అటు, గిన్నిస్ బుక్ ఎడిటర్ ఇన్ చీఫ్ గ్లెన్ డే మాట్లాడుతూ, సచిన్ టెండూల్కర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. సచిన్ భారత్ కు చెందిన అత్యంత ప్రముఖుడని, ఎన్నో రికార్డులు నమోదు చేశాడని పేర్కొన్నారు. భారత్ లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా అతడో స్ఫూర్తిప్రదాత అని కితాబిచ్చారు.

  • Loading...

More Telugu News