: రైలు ఛార్జీల పెంపుకు రైల్వే శాఖ ప్రతిపాదన!
మరోసారి ఛార్జీల పెంపుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో టికెట్ ఛార్జీల పెంపుదలను ప్రతిపాదించనున్నారు. విద్యుత్తు రుసుములు గణనీయంగా పెరగడంతో ఆ భారాన్ని ప్రయాణికులపై కొంతమేర మోపాలన్న నిర్ణయంగా తెలుస్తోంది. ఇంధన రుసుముల ఆధారంగా టికెట్ ధరలను ఆరు నెలలకొకసారి సవరించాలని అంతకుముందు రైల్వే ప్రకటించింది. ఈ క్రమంలో చివరిగా జూన్ లో టికెట్లపై 4.2%, సరకు రవాణాపై 1.4% చొప్పున రైల్వే శాఖ ధరల్ని పెంచింది. మళ్లీ ఈ నెలలో ధరలను సవరించాల్సి ఉంది. పెంపును వచ్చే ఫిబ్రవరిలో చేపట్టబోతున్నారు. ఇటీవలి కాలంలో విద్యుత్తు, ఇతర ఇంధన రుసుములు నాలుగు శాతం పెరగడంతో కొత్త బడ్జెట్లో టికెట్ ఛార్జీల పెంపును ప్రతిపాదించనున్నామని, నిర్వహణ వ్యయం పెరిగిపోతున్న నేపథ్యంలో కొంత భారాన్ని ప్రజలు కూడా మోయాలి కదా? అని రైల్వే మంత్రి సురేష్ ప్రభు పరోక్షంగా వ్యాఖ్యానించారు.