: క్లార్క్ స్థానంలో స్టీవెన్ స్మిత్ కు ఆసీస్ పగ్గాలు
టీమిండియాతో మిగిలిన మూడు టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టుకు యువ ఆల్ రౌండర్ స్టీవెన్ స్మిత్ (25) నాయకత్వం వహిస్తాడు. రెగ్యులర్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ గాయం కారణంగా సిరీస్ కు దూరమవడంతో ఆసీస్ సెలెక్టర్లు స్మిత్ కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఆసీస్ టెస్టు జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్న 45వ ఆటగాడు స్మిత్. ఇప్పటివరకు 23 టెస్టులాడిన స్మిత్ 1749 పరుగులు చేశాడు. వాటిలో 5 సెంచరీలు, 9 అర్థసెంచరీలు ఉన్నాయి. బ్యాటింగ్ సగటు 46.02 కాగా, స్ట్రయిక్ రేటు 52.10. ఇక, 45 వన్డేలాడి 921 పరుగులు సాధించాడు. 2 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో స్మిత్ స్ట్రయిక్ రేటు 87.71గా ఉండడం విశేషం. లెగ్ స్పిన్ బౌలింగ్ చేసే ఈ న్యూ సౌత్ వేల్స్ యువ కెరటం వన్డేల్లో 27 వికెట్లు, టెస్టుల్లో 14 వికెట్లు చేజిక్కించుకున్నాడు.