: హంతకుడిని మీడియా ప్రధాని పీఠంపై కూర్చోబెట్టింది: యూపీ మంత్రి ఆజాం ఖాన్
వివాదాలకు కేంద్ర బిందువైన ఉత్తరప్రదేశ్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఆజం ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి ఆయన నోరుపారేసుకున్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ కావడం గమనార్హం. ‘‘హంతకుడిని మీడియా ప్రధాన మంత్రిని చేసింది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని మోరాదాబాద్ వెళ్లిన ఆజం ఖాన్ అక్కడే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 2002లో జరిగిన గోద్రా అల్లర్ల సమయంలో గుజరాత్ సీఎంగా మోదీ ఉన్న సంగతి తెలిసిందే. నాటి ఘటనను దృష్టిలో పెట్టుకునే ఆజం ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. మొరాదాబాద్ లోని మైనార్టీ వర్గాల్లో విద్యపై అవగాహన పెంచే కార్యక్రమంలో పాల్గొన్న ఆజం ఖాన్ మోదీపై విరుచుకుపడ్డారు. మోదీతో పాటు ఆయన సన్నిహితుడిగా పేరు పడ్డ పారిశ్రామికవేత్త గౌతం అదానీపై కూడా ఆజం ఖాన్ విమర్శలు గుప్పించారు.