: చక్రి మృతి పట్ల సంతాపం తెలిపిన జగన్, పొన్నాల
తెలంగాణలోని మారుమూల ప్రాంతంలో జన్మించి, స్వయంకృషితో తెలుగు సినీ పరిశ్రమలో అగ్రశ్రేణి సంగీత దర్శకుడిగా ఎదిగిన చక్రి మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యలు చక్రి మృతి పట్ల సంతాపం తెలిపారు. చక్రి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.