: ముంబయిలో అండర్ గ్రౌండ్ రింగ్ రోడ్డు
ముంబయిలో అంతకంతకూ పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలను అధిగమించేందుకు భూగర్భ రింగ్ రోడ్డును నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ. 90 వేల కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. అలాగే, సూరత్-ముంబయిల మధ్య ఎలివేటెడ్ రోడ్డు నిర్మించే ప్రతిపాదన కూడా ఉందని చెప్పారు. దీనికితోడు, అహ్మదాబాద్-ముంబయి హైవేకు టన్నెల్ రింగ్ రోడ్డును కూడా నిర్మించాలని నిర్ణయించామని వెల్లడించారు.