: సంగీత దర్శకుడు చక్రి కన్నుమూత
ప్రముఖ సంగీత దర్శకుడు చక్రి (40) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా కొద్దిసేపటి క్రితం ఆయన మృతి చెందారు. వరంగల్ జిల్లా మహబూబాబాద్ కు చెందిన చక్రధర్ గిల్లా సినీరంగంలో చక్రిగా అరంగేట్రం చేశారు. 85 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన చక్రి, సత్యం సినిమాకు అందించిన సంగీతానికి ఫిల్మ్ ఫేర్ అవార్డును కూడా అందుకున్నారు. సింహా చిత్రానికి ఆయన నంది అవార్డునూ కైవసం చేసుకున్నారు. బాచీ సినిమాతో అరంగేట్రం చేసిన చక్రి 1974, జూన్ 15న జన్మించారు. చక్రి చివరిసారిగా సంగీతం అందించిన చిత్రం ఎర్రబస్సు. పలువురు గాయనీ, గాయకులను ఆయన సినీరంగానికి పరిచయం చేశారు. చక్రి అకాల మరణం వార్తతో టాలీవుడ్ దిగ్భ్రాంతిలో కూరుకుపోయింది.