: పార్టీ కేడర్ కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు: ఎర్రబెల్లి
విద్యార్థుల త్యాగాలు, ప్రజల రక్తంతో వచ్చిన తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వలాభాపేక్షకు వాడుకుంటున్నారని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు మండిపడ్డారు. పార్టీ కేడర్ ను తృప్తి పరచేందుకు కొత్త పదవులను సృష్టిస్తూ, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రైతులు, పింఛన్లు రాని వారు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే పట్టించుకోని కేసీఆర్... పార్టీ నేతల కోసం కొత్తగా పార్లమెంటరీ సెక్రటరీ పదవులను సృష్టించారని విమర్శించారు.