: మోదీ యుగ పురుషుడు: కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి


ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్లమెంట్ ను కుదిపేసిన కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తాజాగా ప్రధాని నరేంద్ర మోదీని పొగడ్తల్లో ముంచెత్తారు. మోదీని యుగ పురుషుడిగా అభివర్ణించిన ఆమె, మోదీని గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ల సరసన కూర్చోబెట్టారు. ఆదివారం గుజరాత్ రాజధాని గాంధీ నగర్ లో జరుగుతున్న భక్తి యోగ వేదాంత సమ్మేళన్ లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, బాపూజీ ల సొంతగడ్డకు వచ్చాను. ఈ గడ్డ నుంచే యుగ పురుషుడు నరేంద్ర మోదీ వచ్చారు’’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News