: 24న ఏపీ సర్కారు ఆధ్వర్యంలో సెమీ క్రిస్ మస్ వేడుకలు


ఏపీ సర్కారు ఈ ఏడాది క్రిస్ మస్ వేడుకలను అధికారికంగా నిర్వహించనుంది. ఈ నెల 24 న గుంటూరులో సెమీ క్రిస్ మస్ పేరిట జరగనున్న ఈ వేడుకలకు సీఎం చంద్రబాబునాయుడు హాజరుకానున్నారని మంత్రి రావెల కిశోర్ బాబు తెలిపారు. ఆదివారం గుంటూరులోని జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో ప్రభుత్వ శాఖల అధికారులు, క్రైస్తవ మత పెద్దలతో భేటీ అయిన కిశోర్ బాబు, వేడుకలకు సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేశారు. ఈ నెల 24న సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సెమీ క్రిస్ మస్ వేడుకలను నిర్వహించనున్నామని ఆయన వెల్లడించారు. అయితే వేడుకల నిర్వహణకు వేదికను ఇంకా ఎంపిక చేయలేదని చెప్పిన ఆయన త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ తరహా వేడుకలను హైదరాబాదులోని జూబ్లీ హాల్ లో నిర్వహించేవారని చెప్పిన కిశోర్ బాబు, రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా గుంటూరులో సెమీ క్రిస్ మస్ వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News