: దక్షిణాఫ్రికా సుందరి రోలిన్ స్ట్రాస్ కు మిస్ వరల్డ్ కిరీటం
దక్షిణాఫ్రికాకు చెందిన అందగత్తె రోలిన్ స్ట్రాస్ 2014 మిస్ వరల్డ్ కిరీటాన్ని ఎగరేసుకెళ్లింది. లండన్ లో జరిగిన పోటీల్లో వందకు పైగా దేశాల సుందరీమణులు పాల్గొనగా, రోలిన్ స్ట్రాస్ ను న్యాయ నిర్ణేతలు విజేతగా ప్రకటించారు. వైద్య విద్యనభ్యసిస్తున్న రోలిన్, తన పదునైన సమాధానాలతో ఆకట్టుకుంది. ఇక మిస్ వరల్డ్ తొలి రన్నరప్ గా హంగరీ భామ కల్సర్ నిలవగా, రెండో రన్నరప్ గా అమెరికా అందాల భామ సప్రిత్ మూడో స్థానాన్ని దక్కించుకుంది. భారత్ తరఫున బరిలోకి దిగిన ఢిల్లీ సుందరి కోయల్ రాణా టాప్ టెన్ లో స్థానం దక్కించుకున్నా, టాప్ 5 జాబితాలో మాత్రం చోటు దక్కించుకోలేకపోయింది. అయితే బెస్ట్ డిజైనర్ అవార్డును దక్కించుకున్న కోయల్ ఫరవాలేదనిపించింది.