: కాంగోలో ఘోర పడవ ప్రమాదం... 129 మంది మృతి
ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. టంగన్ యికా సరస్సులో ఓ బోటు మునిగిపోయింది. దీంతో, 129 మంది మృత్యువాత పడ్డారు. మరికొందరు గల్లంతయ్యారు. కాగా, మృతదేహాలను వెలికితీశారు. ఈ బోటు కలేమీ నుంచి దక్షిణ కివు ప్రావిన్స్ కు వెళుతుండగా ప్రమాదం జరిగింది. టంగన్ యికా సరస్సు ప్రపంచంలోనే అతి పొడవైన మంచినీటి సరస్సుగా ప్రఖ్యాతిగాంచింది.