: ప్రకాశం జిల్లాలో రేపు చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. అధికారులు సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ పర్యటన వివరాలను మీడియాకు తెలిపారు. కొండేపిలో జరిగే రైతు సాధికారిక సదస్సులో బాబు పాల్గొంటారని, రైతులు, పింఛన్ దారులు, డ్వాక్రా మహిళలతో మాట్లాడతారని వివరించారు. కాగా, సీఎం రాక సందర్బంగా కొండేపిలో హెలీప్యాడ్ సిద్ధం చేశారు. జిల్లాకు చెందిన మంత్రి శిద్ధా రాఘవరావు ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.