: ముగిసిన పీజే శర్మ అంత్యక్రియలు
నటుడు సాయి కుమార్ తండ్రి, సీనియర్ నటుడు పీజే శర్మ అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాదులోని ఎర్రగడ్డ శ్మశాన వాటికలో శర్మ భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కాగా, ఆయన అంతిమయాత్రలో అభిమానులు, బంధమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పీజే శర్మ ఆదివారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. మనవడు, యువ హీరో ఆది వివాహం జరిగిన మరుసటి రోజే ఆయన ఈ లోకాన్ని వీడడంతో సాయి కుమార్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.