: సీఎం సహాయనిధికి టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ విరాళం
హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం విజయవాడలో టాలీవుడ్ నటులు క్రికెట్ మ్యాచ్ ద్వారా నిధులు సేకరించడం తెలిసిందే. ఈ మొత్తాన్ని సీఎం సహాయనిధికి అందించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ తరపున రూ.20 లక్షల చెక్కును నటులు శ్రీకాంత్, జగపతిబాబు, తరుణ్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు అందించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ కు అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. అందాల తారలు శాన్వి, అర్చన, హంసానందిని, కామ్న జెఠ్మలాని తదితరులు డ్యాన్సులతో అభిమానులను అలరించారు.