: జమ్మూ కాశ్మీర్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్
జమ్మూ కాశ్మీర్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో నాలుగో దశ పోలింగ్ ముగిసింది. చెదురుమదురు సంఘటనలు మినహాయిస్తే, పోలింగ్ ప్రశాంతంగానే జరిగింది. కాగా, మధ్యాహ్నం 12 గంటల సమయానికి జమ్మూ కాశ్మీర్లో 24 శాతం, మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఝార్ఖండ్ లో 59.90 శాతం పోలింగ్ నమోదైంది. నాలుగో దశలో ఝార్ఖండ్ లో 15 నియోజకవర్గాలకు పోలింగ్ జరగ్గా, జమ్మూ కాశ్మీర్లో 18 నియోజక వర్గాల్లో పోలింగ్ జరిగింది.