: ధోనీ కెప్టెన్సీకి కాలం చెల్లింది, కోహ్లీకి బాధ్యతలు అప్పగించాలి: చాపెల్
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ భారత క్రికెట్ పై ఓ వ్యాసంలో తన అభిప్రాయాలు వెల్లడించాడు. ఎంఎస్ ధోనీ కెప్టెన్సీకి కాలం చెల్లిందని, కోహ్లీకి పూర్తి స్థాయిలో టెస్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని అభిప్రాయపడ్డాడు. అడిలైడ్ టెస్టులో కోహ్లీ ప్రదర్శన సెలక్టర్లను కచ్చితంగా ఆలోచనలో పడేసి ఉంటుందన్నాడు. టెస్టుల్లో టీమిండియా కెప్టెన్సీ మార్పుకు ఇదే మంచి సమయం అని పేర్కొన్నాడు. ఆసీస్ తో తొలి టెస్టులో కోహ్లీ రెండు ఇన్నింగ్సుల్లోనూ సెంచరీలు నమోదు చేయడం విశేషం. ఆ మ్యాచ్ లో తాత్కాలిక సారథే అయినా, పూర్తిస్థాయి నాయకుడిలా సత్తా చాటాడని చాపెల్ కొనియాడాడు. బౌన్సర్ తాకినా వెరవకుండా, సాధికారికంగా షాట్లు సంధించాడని కితాబిచ్చాడు. అయితే, అడిలైడ్ మ్యాచ్ లో చోటుచేసుకున్న వాగ్యుద్ధాల సందర్భంగా, కోహ్లీ పరిణతితో వ్యవహరించాల్సిందన్నాడు.