: రెండో టెస్టుకు ఆసీస్ జట్టులో మార్పులు!


అడిలైడ్ టెస్టులో టీమిండియాపై అద్భుత విజయాన్నందుకున్న ఆస్ట్రేలియా జట్టు రెండో టెస్టుకు సమాయత్తం అవుతోంది. బ్రిస్బేన్ వేదికగా ఈ మ్యాచ్ డిసెంబర్ 17 నుంచి 21 వరకు జరుగుతుంది. కాగా, ఈ మ్యాచ్ కు ఆసీస్ జట్టులో పలు మార్పులు ఉండొచ్చని కోచ్ డారెన్ లెహ్మన్ అంటున్నాడు. ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్ మైకేల్ క్లార్క్ కండరాల గాయంతో సిరీస్ కు దూరమయ్యాడు. దీంతో, అతని స్థానంలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ షాన్ మార్ష్ ను జట్టులోకి తీసుకున్నారు. అటు, లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా జట్టులోకొచ్చాడు. తొలి టెస్టులో విఫలమైన సిడిల్ స్థానంలో స్టార్క్ ను తీసుకునే అవకాశాలు ఉన్నాయని లెహ్మన్ తెలిపాడు. పెద్దగా పరుగులు చేయని ఓపెనర్ క్రిస్ రోజర్స్ రెండో టెస్టుకు ఎంపిక కాకపోవచ్చన్నాడు.

  • Loading...

More Telugu News