: పీజే శర్మ మృతికి చిరంజీవి సంతాపం


నటుడు సాయికుమార్ తండ్రి పీజే శర్మ మృతికి నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. శర్మ గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. శర్మ స్వగ్రామం విజయనగరం జిల్లా కల్లేపల్లి. ఆయన నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టు, రచయితగా బహుముఖ ప్రజ్ఞ చాటుకున్నారు. 500కి పైగా చిత్రాల్లో నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రతిభను ప్రదర్శించారు. ఆయన కీర్తికిరీటంలో ఓ నంది అవార్డు, ఓ ఫిలింఫేర్ అవార్డు ఉన్నాయి. చివరగా ఆయన 'నాగ' సినిమాలో నటించారు.

  • Loading...

More Telugu News