: విభజన చట్టంలో సవరణలు: వెంకయ్య నాయుడు


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో కొన్ని మార్పులు, చేర్పులు చేయాల్సి ఉందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ విషయమై ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చిస్తున్నామని ఆయన వివరించారు. యూపీఏ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో చట్టం తెచ్చిందని వెంకయ్య నాయుడు విమర్శించారు. పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించడంలేదన్నారు. శారదా స్కాంలో సీబీఐ తన పని తాను చేస్తోందని, అరెస్ట్ లు జరిగితే, మమతా బెనర్జీ కేంద్రంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రెండు కొత్త రాష్ట్రాలకు కేంద్రసాయం అందుతుందని వెంకయ్య నాయుడు చెప్పారు.

  • Loading...

More Telugu News