: 199 పరుగుల భారీ స్కోరు చేసిన శ్రీకాంత్ జట్టు
హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సినీ తారల క్రికెట్ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన శ్రీకాంత్ ఎలెవన్ జట్టు భారీ స్కోరును నమోదు చేసింది. మొత్తం 19.2 ఓవర్లలో శ్రీకాంత్ జట్టు 199 పరుగులు చేసింది. శ్రీకాంత్ జట్టులో నాని 30, నిఖిల్ 40 పరుగులతో రాణించారు. అటు, తరుణ్ జట్టులో అజయ్ ఒకే ఓవర్లో 2 వికెట్లు తీశాడు. ఒక దశలో శ్రీకాంత్ జట్టు 200 పరుగుల మార్కును అవలీలగా దాటుతుందని భావించినా, చివరి 2 ఓవర్లలో ఆటగాళ్ల మధ్య అవగాహనా లోపంతో రన్ అవుట్ రూపంలో 3 వికెట్లు కోల్పోవాల్సి వచ్చింది.