: బారికేడ్‌ ను ఢీ కొట్టిన కారు... ఇద్దరు పోలీసుల మృతి


రోడ్డుపై ఉన్న బారికేడ్ల ముందు విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులను వేగంగా వచ్చిన ఓ కారు బలి తీసుకుంది. ఈ ఘటన నేటి ఉదయం ఢిల్లీలోని కాళింది కుంజ్ ప్రాంతంలో జరిగింది. మృతుల్లో ఒక ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. ప్రమాదంలో గాయపడ్డ మరో కానిస్టేబుల్ ను ఆసుపత్రిలో చేర్చారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News